మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకునే భార్యకు ఆస్తి హక్కు ఉంటుందని ప్రకటించింది మద్రాసు హైకోర్టు. భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని తీర్పు ఇవ్వడం జరిగింది మద్రాసు హైకోర్టు. తాజాగా తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది.
ఇక చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె పిటీషన్ వేసింది. ఈ తరుణంలోనే.. ఆ పిటీషన్ ను సేలం సివిల్ కోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది బాధిత మహిళ. జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం వద్ద ఈ కేసు విచారణ జరిగింది. దీంతో భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకునే భార్యకు ఆస్తి హక్కు ఉంటుందని ప్రకటించింది మద్రాసు హైకోర్టు. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని తీర్పు ఇచ్చారు.