తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్త..త్వరలోనే కొత్త రేషన్ షాపులు !

-

తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ షాపులు ఇవ్వడంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం.. కానీ దాని వల్ల ప్రస్తుతం ఉన్న పాత డీలర్‌ షాపులపై ప్రభావం పడుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో.. కొత్తగా 4 వేలకు తాండాలు కూడా గ్రామా పంచాయతీలు ఏర్పాటు అయ్యాయని వివరించారు.

అన్ని చోట్ల కాకుండా.. అవసరం అనుకున్న చోట కొత్త రేషన్ షాపులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. రేషన్‌ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి ఉత్తమ్. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి ఉత్తమ్.

Read more RELATED
Recommended to you

Latest news