హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఈ తరుణంలోనే… బుల్డోజర్లను అడ్డుకున్నారు అనుహార్ అపార్ట్ మెంట్ వాసులు. దీంతో హైడ్రా సిబ్బంది… అపార్ట్ మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
2016 కన్నా ముందు కట్టిన బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్ లను కూల్చమని ఇటీవలే హైడ్రా ప్రకటన చేసింది. మళ్లీ ఈ కూల్చివేతలు ఏంటి అంటూ అధికారులను నిలదీశారు అపార్ట్ మెంట్ వాసులు. దీంతో మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు
అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేతలు
హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం
మణికొండ మునిసిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్… pic.twitter.com/HV6bUQaD4c
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024