మంత్రి కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ కి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్

-

బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ కి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. బుధవారం అసెంబ్లీ సమావేశాలలో క్వశ్చన్ అవర్ జరుగుతుండగా మాజీ మంత్రి హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈ ఫిర్యాదు చేసింది.

సభ జరుగుతున్న సమయంలో స్పీకర్ నోటీసులో లేకుండా, అనుమతి తీసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం అనేది సభా నియమావళి ఉల్లంఘన అవుతుందని బిఆర్ఎస్ పేర్కొంది. సభ హక్కుల ఉల్లంఘన వివరాల ప్రకారం రూల్ 319 ప్రకారం సభలో గౌరవ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదా అసభ్య పదజాలం ఉపయోగించడం సభలో అనుమతించబడదు.

రూల్ నెంబర్ 30 ప్రకారం సభలో ఎవరి గురించైనా మాట్లాడాలంటే ముందుగా స్పీకర్ కి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూల్ నెంబర్ 45 ప్రకారం సభా ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సభా నియమావళికి విరుద్ధం. గౌరవ సభ్యులపై సభలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దుర్మార్గమని బిఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news