ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు వలన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. కానీ రిలేషన్షిప్ బాగుండాలంటే ప్రేమగా ఉండాలి. అలాగే కొన్నిటిని అనుసరించాలి. ఇలా చేస్తే మాత్రం సంతోషంగా హాయిగా ఉండొచ్చు. రిలేషన్షిప్ బాగుంటుంది. గొడవలు వంటివి కూడా రావు. ఎప్పుడూ కూడా ప్రేమ ఇద్దరి దగ్గర నుంచి రావాలి. ఒకరే ప్రేమిస్తూ ఉంటే ఆ రిలేషన్ షిప్ కి అర్థం లేదు. ఎప్పుడూ కూడా ఇద్దరూ ప్రేమగా ఉంటే హాయిగా ఉండొచ్చు. అలాగే బంధం బాగుండాలంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటే అంతా బాగుంటుంది.
చాలామంది సరైన కమ్యూనికేషన్ చేయకుండా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓపెన్ గా మాట్లాడాలి. సమస్యను చర్చించుకోవాలి. ఈ రోజుల్లో ఆఫీస్ పనుల వలన ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటున్నారు. అలాంటప్పుడు వారికంటూ కొంచెం సమయం ఉండాలి ఎప్పుడూ కూడా భాగస్వామికి అంటూ కొంచెం సమయాన్ని ఇవ్వాలి. అలా సమయం ఇచ్చినప్పుడు వారు రిఫ్రెష్ గా ఉంటారు రహస్యాలని దాయడం మంచిది కాదు. ఏ రహస్యాలని దాచకుండా ఓపెన్ గా అన్నిటిని మాట్లాడండి. అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది.
గౌరవించకపోతే వారి మధ్య గొడవలు వస్తాయి గ్యాప్ పెరుగుతుంది. ఇబ్బందులు వస్తాయి, కాబట్టి గౌరవం అనేది చాలా ముఖ్యం. కొంచెం స్పేస్ ఇవ్వడం చాలా అవసరం లేకపోతే రిలేషన్షిప్ చెడిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళని బాగా అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోవాలి. మీ జీవిత భాగస్వామికి సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా అవసరం. వారు ఓడిపోయినా, గెలిచినా కూడా మీ సపోర్ట్ ఎప్పుడూ వరకి ఉండాలి.
ఎప్పుడైనా వారు గెలిస్తే మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళు ఓడిపోతే దాని నుంచి బయటకు వారిని తీసుకురావాలి జీవిత భాగస్వామి తప్పు చేస్తే క్షమించడం చాలా అవసరం. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసి ఎవరు కూడా తప్పులు చేయరు అని మీరు వారు తప్పు చేసినా మన్నించాలి. అప్పుడే ప్రేమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకోవాలి. వారి పుట్టిన తేదీని వారికి సంబంధించిన విషయాలని గుర్తు పెట్టుకోవాలి. వాటిని మర్చిపోవద్దు. ఇలా మీరు కనుక వీటిని అనుసరించారంటే కచ్చితంగా మీ రిలేషన్షిప్ బాగుంటుంది.