ప.గో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పార్సిల్ లో డెడ్ బాడీ కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప.గో జిల్లా ఉండి మండలం యoడగండి లో డెడ్ బాడీ కలకలం రేపింది. పార్సిల్ లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం తెరపైకి వచ్చింది. జగనన్న కాలనీలో సాగి తులసి ఇల్లు నిర్మిస్తుండగా ఇంటి సామాగ్రితో పాటు పార్సిల్ వచ్చింది ఓ వ్యక్తి డెడ్ బాడీ.
పార్సెల్ రాజమండ్రి క్షత్రియ పరిశుద్ధ నుంచి వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సమాచారం పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్సిల్ లో డెడ్ బాడీ కలకలం చోటు చేసుకోవడంతో… వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.