సిరిసిల్లాలో మరో నేతన్న బలి…కేటీఆర్‌ ట్వీట్‌ !

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల గాంధీనగర్ లో దూస గణేష్(45) అనే నేత కార్మికుడు ఉపాధి లేదనీ,అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సువర్ణ ఇద్దరు కూతుర్లు సుమశ్రీ,పూజతలు ఉన్నారు. ఇక ఈ సంఘటన పై కేటీఆర్‌ స్పందించారు.

సర్కారు చేతిలో మరో నేతన్న బలి!… ఇక నావల్ల కాదు అని దూస గణేష్…. తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని ఎమోషనల్‌ అయ్యారు. సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం వలన, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక వెళ్లిపోయాడని తెలిపారు.

సిరిసిల్ల ను మళ్లీ ఉరిసిల్ల గా మారుస్తున్న రేవంత్ రెడ్డి….వినిపిస్తున్నాయా ఆ చిన్నారుల ఆర్తనాధాలు? అంటూ నిలదీశారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన నువ్వు వెళ్లి చెప్పు ఆ కూతుళ్లకు…ప్రభుత్వం కక్షసాధింపుల్లో క్షణం తీరికలేకుండా ఉంది అని!.. నేతన్నలైనా, రైతన్నలైనా తమ బిడ్డలను అనాథలు గా వదిలి వెళ్ళాల్సిందే అని… మరణవాంగ్మూలాలు, అప్పుల చిట్టాలే….వారి బిడ్డలకి దక్కే ఆస్తులు అని అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news