కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎండు కొబ్బరి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ధరను భారీగా పెంచింది. ఇక పై ఎండు కొబ్బరి… ఎంఎస్పి 420 రూపాయలు ఉండనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. వచ్చే 2025 సీజన్ లో… ఎండు కొబ్బరి కి కనీసం మద్దతు ధర… క్వింటాల్కు 422 పెంచబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. దీంతో క్వింటాల్ కొబ్బరి ధర 12,100 రూపాయలకు చేరనుంది.
ఇందుకోసం 855 కోట్లు అదనంగా.. కేటాయిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేయడం జరిగింది. అలాగే బంతి కొబ్బరి కనీస మద్దతు ధర ₹100 పెంచనున్నట్లు ప్రకటన చేసింది. ఎండు ఉత్పత్తి దేశంలో… అత్యధికంగా కేవలం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అక్కడ దాదాపు 31 శాతం సాగు జరుగుతుంది. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎండు కొబ్బరి… దొరుకుతుంది. ఏపీలో దాదాపు ఏడు శాతం ఎండు కొబ్బరి లభ్యమవుతుంది