కిమ్స్ వైద్యులకు మంత్రి కోమటిరెడ్డి కీలక సూచన

-

పుష్ప సినిమా విడుదల సమయంలో బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని.. సీఎం రేవంత్ రెడ్డి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లవలసిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు.

అనంతరం శ్రీ తేజను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ ఆరోగ్యం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులకు మంత్రి కోమటిరెడ్డి పలు సూచనలు చేశారు. శ్రీ తేజ్ చికిత్స కు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అవసరం అయితే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి శ్రీతేజ్ ని బ్రతికించాలని కిమ్స్ వైద్యులకు సూచించారు మంత్రి.

అనంతరం శ్రీ తేజ తండ్రికి రూ. 25 లక్షల చెక్ ని అందించారు. ఇక శ్రీ తేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. ఇక శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు కిమ్స్ వైద్యులు. అతను క్రమంగా కోలుకుంటున్నాడని , ప్రస్తుతం వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news