అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు !

-

Court notices to Asaduddin Owaisi: ఎంఐఎం పార్టీ చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీకి ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా ఎంఐఎం పార్టీ చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు పంపింది. ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసింది యూపీలోని బ‌రేలీ కోర్టు. లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించారు న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా.

Court notices to Asaduddin Owaisi

చట్ట సభలో జై పాల‌స్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాల‌ను ఒవైసీ ఉల్లంఘించార‌ని పిటిషనర్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో జ‌న‌వ‌రి 7న తమ ముందు హాజరు కావాలని ఒవైసీని ఆదేశించింది కోర్టు.

 

Read more RELATED
Recommended to you

Latest news