వైసీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి, NDA రెండింటికీ మేం సమాన దూరంగా ఉంటామని వెల్లడించారు వైసీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు…..మాది న్యూట్రల్ స్టాండ్ అన్నారు. “వన్ నేషన్ వన్ ఎలక్షన్ ” మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా JPC ఎదుట మా అభిప్రాయం చెబుతాని ప్రకటించారు వైసీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.
ప్రాథమిక దశలో మేం వ్యతిరేకించ లేదని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని క్లారిటీ ఇచ్చారు. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా చేసే ఆందోళనలతో సమిష్టిగా పోరాటం చెయ్యాలని కోరారు. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు వైసీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.