న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం రెడీ అవుతుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసారు పోలీస్ కమిషనర్. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. అలాగే అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్.
ఇక హోటల్స్, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణలు మధ్యరాత్రి 1:00 AM వరకు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ లో సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వాడితే నిర్వాహకుల పై కఠిన చర్యలు ఉన్నాయి అని స్పష్టం చేసారు ఇక నోవోటేల్ హోటల్ జంక్షన్, R.K బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో “షీ-టీమ్స్” లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష.. డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుంది అని పేర్కొన్నారు కమిషనర్.