తండ్రి డబ్బులు ఇవ్వట్లేదని వేధించడంతో కూతురి సూసైడ్.. వీడియో వైరల్!

-

తన తండ్రి తీసుకున్న డబ్బులు చెల్లించాలని పోలీసులు వేధించడంతో వీడియో తీసి మరీ ఓ పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని – నాచారం పీఎస్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సరస్వతి నగర్‌లో స్థానికంగా ఉండే పులివర్తి సంగీత్ రావు కుమార్తె దీప్తి (29) ఐఐసీటీలో పీహెచ్‌డీ చేస్తోంది.

 

వీరి ఇంటి ఎదురుగా ఉండే కానిస్టేబుల్ అనిల్ భార్యకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు 2022లో రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయగా.. దీనిపై నాచారం పీఎస్‌లో కేసు నమోదైంది. అనంతరం అనిల్‌కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పీఎస్‌కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్ రావు ఆరోపించారు. కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలివ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ చేశారని, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని..

డబ్బులు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని దీప్తి ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పీఎస్‌కు పిలిచి కానిస్టేబుల్ అనిల్ బెదిరించాడని.. దీంతో మనోవేదనకు గురైన దీప్తి ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని మరి దీప్తి ప్రాణాలు తీసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news