ఏపీ ప్రజలపై 15485.36 కోట్ల బాదుడు – పెద్దిరెడ్డి

-

ఏపీ ప్రజలపై మొత్తంగా 15485.36 కోట్ల బాదుడుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని పెద్దిరెడ్డి ఆగ్రహించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ మాట్లాడుతూ…..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల బాదుడుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని… చంద్రబాబు నాయుడు గతంలో కడప తో సహా అనేక చోట్ల విద్యుత్ చార్జీలు పెంచబోమని మాటిచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా వీలైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారన్నారు.

Peddireddy Ramachandra Reddy on pac

ఆయన ఇచ్చిన హామీ మేరకు పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలి…. అదేవిధంగా గతంకంటే తక్కువ గా విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ పై చంద్రబాబు నాయుడు అనేక బూటకపు హామీలు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు అన్ని మరచిపోయి ఆరు నెలల్లో రూ. 6072.86 కోట్లు, ఆ వెంటనే రూ. 9412.50 కోట్లు భారం ప్రజలపై మోపారని నిప్పులు చెరిగారు.

మొత్తంగా 15485.36 కోట్ల బాదుడుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. గతంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తే…. వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్‌ అయ్యారు. మరో పక్క ఎస్సీ ఎస్టి లకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు కూడా మంగళం పలుకుతున్నారు…. వారికి ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు కూడా వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news