గంజాయి విక్రయానికి ఖమ్మం రూట్ వాడుతున్నారు : సీపీ సునీల్ దత్

-

గంజాయి రవాణాపై మేము డేటా ప్రకారం వెళ్తున్నాం అని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గంజాయి పట్టుకుంటున్నారు. అక్కడకు గంజాయి వెళ్లేందుకు ఖమ్మం రూట్ వాడుతున్నారు అని పేర్కొన్నారు. ఇక ఖమ్మం నగరానికి గంజాయి కచ్చితంగా వస్తుంది, కానీ పెద్ద మొత్తంలో కాదు. గంజాయి విక్రయ దారుల మీద ఎప్పుడు పోలీసుల దృష్టి ఉంటుంది. అంతకముందు కొన్ని ప్రాంతాల్లో బీట్ కూడ లేదు, ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కూడ పెంచాం. ఖమ్మం టౌన్, రూరల్ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాం. సీసీ టీవీ కెమెరాల కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేశాం.

ఇక సైబర్ క్రైమ్ విషయంలో బాధితులు ఎవరైనా 1930 కి సమాచారం ఇవ్వొచ్చు. గోల్డ్ స్కాం ఖమ్మం నగరానికి పరిమితం కాలేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, కానీ ఖమ్మం నగరంలో మొదటి సారి జరిగింది. ఫేక్ గోల్డ్ స్కాం లో కేసు నమోదు చేసి కొంతమేర గోల్డ్ రికవర్ చేశాం. ఖమ్మం నగరంలో అక్రమంగా ఉంటున్న కొందరు బంగ్లాదేశీయులపై కేసు నమోదు చేసి తిరిగి వాళ్ళను వాళ్ళ దేశానికి పంపించాం. కొంతమందికి ఫేక్ డాక్యుమెంట్ కూడ ఏర్పాటు చేశారు వారి మీద కూడా కేసు నమోదు చేశాం అని సీపీ సునీల్ దత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news