మణికొండ లో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేశారు కబ్జాదారులు. అయితే…. అక్రమంగా వెలసిన నిర్మాణాలలో కూల్చివేతలు చేపట్టనుంది హైడ్రా.
గతంలో కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ, జీహెచ్ఎంసి అధికారులతో పాటు హెచ్ఎండిఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మూడుసార్లు కూల్చివేసినా యధావిధిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారట అక్రమార్కులు. అయితే… హైడ్రా కమీషనర్ రంగనాథన్ అదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టనున్నారట. భారీ పోలీస్ బందోబస్తు కూల్చివేతలు నడుమ కొనసాగనుంది.
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ – మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు pic.twitter.com/7vWQlccJe1
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025