సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పాస్ పోర్ట్ ఆఫీసు కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. దావోస్ వెళ్తున్న నేపద్యంలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ 11 గంటలకు ఇంటినుంచి బయల్దేరి 11.10 బందర్ రోడ్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళతారు సీఎం చంద్రబాబు నాయుడు.
10 నిమిషాల పాటు పాస్ పోర్ట్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఉంటారు. అనంతరం అక్కడనుంచి తిరిగి ఉండవల్లి చేరుకుని హెలికాప్టర్ లో గుంటూరు కు సీఎం చంద్రబాబు నాయుడు పయనం అవుతారు. 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ మధ్యాహ్నం 1.05 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళతారు.