Bujji Thalli video song from Thandel out now: టాలీవుడ్ స్టార్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘బుజ్జి తల్లి’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు.
ఈ పాటలో సాయి పల్లవి, నాగచైతన్య జంట మధ్యలో ఉన్న ఎమోషనల్ జర్నీ కనిపిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.