సిద్దిపేట – కొండపోచమ్మ సాగర్ లో సెల్ఫీ కోసం దిగి గళ్లంతై మృతి చెందిన ఐదుగురిలో ఒక యువకుని శవాన్ని వెలికి తీసారు. సిద్దిపేట జిల్లాలోని మర్కుల్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఏడుగురు యువకులు ప్రమాదవశాత్తు డ్యామ్ లో పడినట్టు తెలుస్తోంది. స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, గజ ఈతగాళ్లు డ్యామ్ లో గాలించారు.
గల్లంతైన వారంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. శామీర్ పేట నుంచి ప్రత్యేక బోటు తీసుకొచ్చి.. అలాగే నాటు పడవలతో గల్లంతైన నలుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. 1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, ఫోటో స్టూడియో వర్కర్ r/o ముషీరాబాద్ 2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు ధనుష్ సోదరుడు. 3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ వయస్సు 17 సం. r/o బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ 4. సాహిల్ s/o దీపక్ సుతార్ వయస్సు 19 సంవత్సరాలు 5. జతిన్ s/o గోపీనాథ్ వయస్సు 17 yrs, ఖైరతాబాద్, చింతల్ బస్తీకి చెందిన ఇద్దరూ బ్రతికి బయటపడ్డారు. వారిలో 1. కొమారి మృగాంక్ s/o వేణుగోపాల్ వయస్సు 17 yrs,ముషీరాబాద్ రాంనగర్ 2. Md ఇబ్రహీం s/o Md హసన్ వయస్సు 20.