సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. నారావారి పల్లికి వెళతారు సీఎం చంద్రబాబు నాయుడు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇందులో భాగంగానే… ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలు తిరుపతి చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు.
తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణిని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రాత్రికి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో మూడు రోజుల పాటు నారావారిపల్లెలో ఉండనున్నారు. స్వగ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బ్యూటిఫికేషన్, సబ్ స్టేషన్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.