భువనగిరి బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి.. నిందితుడిని సీఐ వాహనంలో ముందు కూర్చోబెట్టుకుని!

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపై శనివారం ఎన్ఎస్‌యూఐ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆఫీసులోకి చొరబడిన కొందరు కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను పగులగొట్టి అందులోని ఫర్నిచర్‌‌ను ధ్వంసం చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కాంగ్రెస్ ఫాలోవర్ సురుపంగ చందును ప్రభుత్వ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహనంలో ముందు సీట్ల కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు.

ఆ సమయంలో చందు వీడియో సందేశాన్ని రికార్డు చేశాడు.అందుకు కూడా పోలీసులు సహకరించారు. యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యపదజాలంతో దూషించినందుకు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డామని, ఇక మీదట ఎవరైనా సీఎం, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసినా ఇలానే దాడులు చేస్తామని పోలీసుల పక్కన నుంచి సురుపంగ చందు స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news