సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి ఇవాళ్టి నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు జూపల్లి కృష్ణారావు. ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, ధక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాస్ ట్యునీషియా, పోలాండ్, సింగాపూర్, ఉక్రెయిస్, ఫ్రాన్స్ వంటి 19 విదేశాల నుండి నైపుణ్యం గల 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లైయర్స్, 14 రాష్ట్రాల నుండి 54 మంది జాతీయ కైట్ ప్లైయర్స్ ఈ పండుగలో పాల్గొంటారు.
ఇక పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా.. సికింద్రాబాద్ వద్ద నేటి నుంచి 15 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోటరీ ఎక్స్ రోడ్ నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే దా రి.. YMCA నుంచి క్లాక్ టవర్‌కు మళ్లింపు చేస్తున్నారు. రసూల్‌పురా నుంచి ప్లాజాకు వెళ్లే దారి.. CTO ‘X’ రో డ్స్ నుంచి బలంరాయికి మళ్లింపు చేస్తున్నారు.