దుబాయ్ వేదికగా జరుగుతున్న 24 హెచ్ కారు రేసింగ్‌లో తమిళ అగ్ర హీరో అజిత్ దుమ్ములేపారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేస్ టీమ్‌ను ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొన్న ఆయన టీం సత్తా చాటింది. మూడో స్థానంలో అజిత్ టీం నిలిచింది. రేసింగ్ చేసే క్రమంలో అజిత్ కారుకు ప్రమాదం జరగగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
అయినప్పటికీ ఆయన టీం మూడో స్థానంలో నిలిచింది.దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రేసింగ్ మీద అజిత్‌కు ఉన్న ఫ్యాషనే విజయానికి చేరువ చేసిందన్నారు.‘ఎంతో మందికి మీరు ఆదర్శం అజిత్ గారు’ అని ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం ‘విదా ముయార్చి’ చిత్రీకరణ జరుపుకుంటోంది.