అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించి నివాళులర్పించారు. ముందుగా మందా పార్థివదేహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇదిలాఉండగా, మాజీ ఎంపీ మందా జగన్నాథం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన ఆయన నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు.