రేవంత్ సర్కారుపై మరోసారి అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్..

-

తెలంగాణ ప్రభుత్వం తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి అలకబూనారు. మంగళవారం హనుమకొండలో జరిగిన కొత్త కొండ జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, అక్కడ అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదని తెలిసింది. అక్కడకు వచ్చిన భక్తులు జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌ను అందరి ముందే నిలదీశారు.

దీంతో జాతరలో ఏర్పాట్లు సరిగ్గా లేవని మంత్రి పొన్నం మరోసారి అలిగారు. ఏర్పాట్లు చేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా సికింద్రాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రోటోకాల్ పాటించడం లేదని, సరైన ఏర్పాట్లు చేయలేదని..మంత్రిగా వస్తే మమ్మల్ని పట్టించుకోలేదని పొన్నం ప్రభాకర్ అలిగిన విషయం తెలిసిందే. అది చూసిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ సర్కారుపై సొంత మంత్రే నిరసన తెలుపుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news