చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో హై డ్రామా సాగుతుంది అనే చెప్పాలి. తన అనుచరులతో ఎంబియు సిబ్బంది పై ఫిర్యాదు చేయించారు మంచు మనోజ్. ఎంబియు సిబ్బంది అయిన హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేసారు మంచు మనోజ్ యొక్క అనుచరులు పళణి, వినాయక. అయితే ఇప్పుడు చర్యకి ప్రతి చర్య మాదిరి మంచు మనోజ్ అనుచరుల పై ఫిర్యాదు చేయడానికి చంద్రగిరి పోలీస్ స్టేషన్ వచ్చారు మోహన్ బాబు అనుచరులు.
అయితే నిన్న ఎంబియు డైరీ ఫాం గేటు దగ్గర జరిగిన ఘటన విషయంలో ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని ఇరువర్గాలు వెళ్లిపోయాయి. అయితే తన అనుచరులతో ఫిర్యాదు చేయించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు కూర్చొని మాట్లాడుతుంటే తేలిపోతాయి.. కానీ ఇలా జరగడం బాధాకరం అని పేర్కొన్నారు. అలాగే నేను పండగకి ఇంటికి వెళ్తే గెట్ వేసేసారు అని పేర్కొన్నారు మనోజ్.