భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

-

ఇటీవల కాలంలో చత్తీస్గడ్ లో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్గడ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

సౌత్ బస్తర్ ఏరియాలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టగా.. బీజాపూర్ జిల్లా బారేడుబాక అడవి ప్రాంతం వద్ద భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. దీంతో భద్రత దళాలకు, నక్సల్స్ కి మధ్య కాల్పులు జరిగాయి.

ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఆదివారం కూడా భద్రత సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news