GHMC కమిషనర్ ఇలంబర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. GHMC పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కమిషనర్ ఇలంబర్తి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అవినీతి అధికారులను గుర్తించి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. GHMC లో పని చేస్తున్న ప్రతి కంప్యూటర్ ఆపరేటర్, ఇంజనీరింగ్ విభాగంలోని ప్రతి అధికారిపై బదిలీ వేటు వేయనున్నారట.
GHMC కాంట్రాక్టర్లతో సమావేశమైన కమిషనర్ ఇలంబర్తి…అధికారులు తీసుకునే కమిషన్ల పై ఇలంబర్తి ఆరా తీస్తున్నారట. వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి చీఫ్ ఇంజనీర్ల వరకు ట్రాన్సఫర్స్ చేస్తున్నారని అంటున్నారు. ఒకే చోట 5 ఏళ్లకు మించి పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
కీలక నిర్ణయం తీసుకున్న GHMC కమిషనర్ ?
GHMC పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కమిషనర్ ఇలంబర్తి అడుగులు
అవినీతి అధికారులను గుర్తించి బదిలీ చేయాలని నిర్ణయం
GHMC లో పని చేస్తున్న ప్రతి కంప్యూటర్ ఆపరేటర్, ఇంజనీరింగ్ విభాగంలోని ప్రతి అధికారిపై బదిలీ వేటు
GHMC కాంట్రాక్టర్లతో… pic.twitter.com/7jrFrNF6wH
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025