ఏపీ మంత్రులు, ఎంపీలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, ఎంపీల సమావేశానికి హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని అంటున్నారు. సమావేశానికి ఎంపీలు కొంతమంది రాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు సమావేశానికి రాలేదో చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు.
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప టూర్ ఖరారు అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్చాంద్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
సీఎం మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని , మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యే లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్య క్రమంలో పాల్గొంటారు . అనంతరం కార్యకర్తల సమావేశం లో పాల్గొని కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటారు.