సూర్యాపేటలో ఢీకొన్న రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు.. ఇద్దరు మృతి

-

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం జిల్లాలోని హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన టైంలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా..అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందినట్లు సమాచారం.

కాగా, మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన వారు గుంటూరు వాసులైన సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్దారిణకు వచ్చారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news