తెలంగాణలో 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు..మంత్రులపై ఈటల సంచలనం !

-

తెలంగాణలో 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని మంత్రులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లులు విడుదల కావాలంటే ఓ మంత్రి ఇంట్లో వాళ్లకే కమిషన్ కట్టాల్సిందేనని… ఓ మంత్రి ఇంట్లో వాళ్లే కమిషన్‌ల కోసం దుకాణం ఓపెన్ చేసిందంటూ వ్యాఖ్యనించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. బిల్లులు విడుదల చేయాలంటే 7 నుంచి 10 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

BJP MP Etela Rajender sensational comments

మళ్లీ వస్తామో రామో.. దొరుకుతాదో దొరకదో అన్నట్లు దోచుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. నేను కూడా ఐదేండ్లు ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేశానని… కానీ ఇలా ఇంట్లో కమిషన్ దుకాణం గురించి ఎప్పుడైనా విన్నారా..? అంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news