ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు ప్రేరేపించే పరిస్థితులు కాలేజీలు, స్కూళ్లు కల్పిస్తున్నాయని.. ర్యాంకులు, మార్కులే టార్గెట్‌గా విద్యాసంస్థలు విద్యార్థులపై ప్రెషర్ పెడుతున్నాయి. దీంతో ఇంట్లో చెప్పుకోలేక కొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే విజయనగరం – నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి సాయి మణిదీప్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అంటూ లేఖ రాసి పురుగుల మంది తాగి కాలేజ్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మణిదీప్ ఆత్మహత్య స్థానికంగా సంచలనంగా మారింది.