అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన కేసులో బిగ్ ట్విస్ట్..!

-

అఫ్టజ్ గంజ్ కాల్పుల ఘటన కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చింది. అది చేసింది అమిత్ గ్యాంగ్, మనీష్ గ్యాంగ్ కాదని నిర్ధారించుకున్నారు పోలీసులు. దుండగులు ఇద్దరు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు డాక్యుమెంట్స్, తప్పుడు వివరాలు ఇచ్చినట్లు నిర్దారించుకున్న పోలీసులు.. మొదట మనీష్ గ్యాంగ్ గా బిహార్ పోలీసుల సమాచారం మేరకు ప్రాధమికంగా నిర్ధారించారు. అనంతరం బిహార్ పోలీసులు బీదర్ పోలీసుల సీసీ ఫుటేజీని మనీష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు చూపించడంతో ఆ ఫోటో మనీష్ ది కాదని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఈ స్టోరీ మళ్లీ మొదటికి వచ్చింది.

దుండగులిద్దరు పథకం ప్రకారం మొత్తం ఆపరేషన్ లో ఒక్క సారి కూడా మొబైల్ ఫోన్ వాడకుండా జాగ్రత్త పడ్డారు. దొపిడీ చేసిన డబ్బును పెట్టడానికి బ్యాగులు, బట్టలు, హోటల్ బిల్లులు, ట్రావెల్ టికెట్ దగ్గర నుండి ఫుడ్ తిన్న ప్రతి సంధర్బంలో కూడా కేవలం క్యాష్ మాత్రమే వాడారు. ఎక్కడ కూడా ఆన్ లైన్ లో ఒక్క సారి పేమెంట్ చేయకుండా ముందు జాగ్రత్తతో ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. నిందితులు మొబైల్ ఫోన్ వాడకపోవడం కూడా పోలీసులకు దర్యాప్తులో ఇబ్బందిగా మారింది. తెలంగాణ, కర్ణాటక, బీహార్, చత్తీస్ ఘడ్ పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల వివరాల తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బీదర్ తో పాటు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల సీసీ టీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగానే దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news