రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకాన్ని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ నెల 26 నుంచి కొత్తగా 4 పథకాలను అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోపు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ, వార్డు సభల ద్వారా చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. అయితే, గ్రామ, వార్డు సభలు ప్రజాగ్రహం నడుమ రసాభాసగా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నిర్వహించిన గ్రామసభలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు అధికారులను నిలదీశారు. అధికారులు చెబుతున్న సమాధానాలు వినే పొజిషన్‌లో గ్రామస్తులు లేకపోవడంతో ఎంపీడీవో తిరుపతి అక్కడ నుంచి మౌనంగా లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.