UPSC 2025 సివిల్స్ నోటిఫికేషన్ ని తాజాగా విడుదల చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ కి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల తరువాత దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. మే 25న దేశవ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది.
సివిల్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ల నుంచి సివిల్ సర్వీస్ కి సన్నద్ధం అవుతున్నవారు చాలా మంది ఉంటారు. వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరు. ఈ ఏడాది 979 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోంది. గత ఏడాది 1056 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది యూపీఎస్సీ. గత ఏడాదితో పోల్చితే ఇప్పుడు 77 పోస్టులు తగ్గాయనే చెప్పాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 150 పోస్టులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.