తెలుగు సినీ ఇండస్ట్రీ పలువురు ప్రముఖులపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ FDC చైర్మన్ దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేసింది. అయితే దిల్ రాజు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప్ర-2 చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రాలు సూపర్ హిట్ సాధించడం.. వసూలు చేసిన కలెక్షన్లకు ఐటీ చెల్లించకపోవడంతోనే రైడింగ్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ FDC చైర్మన్ దిల్‌రాజు స్పందించారు. “ఐటీ దాడులు నా ఒక్కడి ఇంటిపైనే కాదు.. ఇండస్ట్రీలో అందరి మీద జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని తన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు చేపడుతోంది.