ఐటీలో అగ్రగామిగా ఎదుగుతోన్న తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

-

ఐటీలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం దావోస్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండో సారి దావోస్ వచ్చామని, చాలా ప్రోత్సాహకరంగా ఈ సమ్మిట్ కొనసాగుతోందన్నారు. పారిశ్రామిక రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని వివరించారు.

ఇక ఐటీ రంగంలోనూ అగ్రగామిగా తెలంగాణ అవతరించబోతున్నదని వెల్లడించారు. వ్యవసాయం, ఫిషరీస్, డెయిరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, గత సంవత్సరం వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలలో 80 శాతం ప్రొగ్రెస్ ఉందని తెలిపారు. గ్లోబల్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కాగా, దావోస్‌‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున అధికారులు బుధవారం ఒక్కరోజే మూడు కంపెనీల ప్రతినిధులతో రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news