బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయం పనులు ప్రారంభం అయ్యాయి. మొత్తం రూ.2.50 కోట్ల రూపాయల ఖర్చుతో ppp మోడల్ లో నిర్మాణం మొదలు పెట్టారు. అయితే 15 ఏళ్ల పాటు ఈ స్థలం లీజుకు ఇచ్చింది GHMC. అయితే కేబీఆర్ పార్కుల్లో వాకర్ల కోసం కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా అప్పగిస్తారు అంటూ వాకర్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక గతంలో మొదటిసారి GHMC స్టాండింగ్ కమిటీలోకి వచ్చిన ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ నెలరోజుల క్రితం మరోసారి స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదనను పెట్టి ఆమోదం తెలిపింది GHMC. దాంతో కేబీఆర్ పార్కు వద్ద సుమారు 1000 గజాల స్థలం లీజు పేరుతో ప్రవేటు పరం అయ్యింది. ఇక ఈ స్థలంలోనే తాజాగా పనులు ప్రారంభించింది ప్రైవేట్ సంస్థ. అయితే ఈ ప్రతిపాదిత మల్టీ లెవల్ పార్కింగ్ బిల్డింగ్ లో కాఫీ షాపులు అలాగే రెస్టారెంట్స్ ఏర్పాటుకి కూడా అనుమతి ఇచ్చింది GHMC.