ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత వైసీపీ హయాంలో దౌర్జన్యం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి జిల్లాల్లో నాయకులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను ప్రత్యర్థి వర్గాలు చింపివేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది.
ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తంబళ్లపల్లెలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు,బ్యానర్లను మరో వర్గం చింపివేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.