నేరుగా ఈడీకే షాకిచ్చిన బాంబే హైకోర్టు.. రూ.1లక్ష జరిమానా

-

సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోక్యం చేసుకుంటుంది. అనగా పన్ను ఎగవేసి,అక్రమంగా ఆర్జించిన సొమ్మును విదేశాలకు హవాలా రూపంలో పంపించడం, ఇతర బ్యాంక్ ఖాతాలా ద్వారా దారి మళ్లించడం వంటి నేరాల్లో ఈడీ జోక్యం అవసరం ఉంటుంది.

అయితే, ముంబైలో ఓ స్థిరాస్థి ఒప్పందం ఉల్లంఘన కేసులో ఈడీ జోక్యం కాస్త ఆ సంస్థకే చెడ్డ పేరు తీసుకోవడంతో పాటు బాంబే హైకోర్టు ద్వారా మొట్టికాయలు వేసేలా చేసింది.అంతేకాకుండా హైకోర్టు రూ.1లక్ష జరిమానా కూడా విధించింది. వివరాల్లోకివెళితే..ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీంతో ముంబై హైకోర్టును రాకేశ్ జైన్ ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది.చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు పలికిన కోర్టు.. ఈడీకి రూ.1లక్ష జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news