రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేస్తున్న తరుణంలో చాలా చోట్ల గ్రామస్తులు అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో గ్రామస్తులు నిలదీస్తున్నారని అధికారులు వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామసభలో ఆరు గ్యారంటీలపై గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారు. అధికారులు లేకపోవడంతో గ్రామస్థులు ఖాళీ కుర్చీలకు అప్లికేషన్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.