హైదరాబాద్, 22 జనవరి 2025: జీ తెలుగు ఛానల్ ఆరంభం నుంచి ఆసక్తికరమైన అంశాలతో, ఆకట్టుకునే కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్‌తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు మరో కొత్త సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ఎన్నాళ్లో వేచిన హృదయం జనవరి 27న ప్రారంభం కానుంది. బాధ్యతలు, బంధాలే ప్రధానంగా సాగే అందమైన ప్రేమకథ ఎన్నాళ్లో వేచిన హృదయం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 గంటలకు, మీ జీ తెలుగులో!
ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ త్రిపుర (తన్వియ) అనే ఒక స్కూల్ టీచర్, వ్యాపారవేత్త అయిన బాలకృష్ణ(చందు గౌడ) మధ్య సాగే కథతో రూపొందుతోంది. కారు ప్రమాదంతో మానసిక వైకల్యానికి గురైన బాలకృష్ణ ఆరోగ్యం బాగుపడేందుకు అతణ్ని రామాపురం తీసుకొస్తారు. కుటుంబ బాధ్యతలతో సాగుతున్న త్రిపుర జీవితం బాలతో ఎలా ముడిపడుతుంది? బాల ఆరోగ్యం బాగుపడేందుకు త్రిపుర ఏం చేసింది? ఇద్దరి జీవితాల్లో వచ్చే సమస్యలేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ని మిస్ కాకుండా చూసేయండి!
ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కుతున్న ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు సిద్ధమైంది. చందు గౌడ, తన్వియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ముంతాజ్, లక్ష్మణ్, ఉమ, కౌశల్, ప్రసాద్, కరాటే కల్యాణి, విశ్వ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ మీరూ తప్పక చూడండి!
భావోద్వేగాల సమాహారంగా సాగే సరికొత్త సీరియల్ ఎన్నాళ్లో వేచిన హృదయం.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!