విజయసాయిరెడ్డి కొత్త ఛానల్ ఏర్పాటు చేయడంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. మీరు ఒక ఛానల్ పెడతాను అన్నారు.. ఆ విషయం మీద ఏమి నిర్ణయం తీసుకున్నారు? అని ఓ జర్నలిస్ట్ అడగగానే… విజయసాయిరెడ్డి సమాధానం ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అన్నాను.. ఇప్పుడు ఏమి చెప్పలేనని వివరించారు. అంటే భవిష్యత్తులో ఛాన్స్ ఉండవచ్చని అందరూ అంటున్నారు.

కాగా… జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. లండన్ లో వున్న జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని వివరించారు. అన్ని వివరాలను జగన్‌కు వివరంగా చెప్పానని తెలిపారు. జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అంటూ విజయసాయిరెడ్డి సమాధానం ఇచ్చారు.
రిపోర్టర్ : మీరు ఒక ఛానల్ పెడతాను అన్నారు.. ఆ విషయం మీద ఏమి నిర్ణయం తీసుకున్నారు?
విజయసాయి రెడ్డి : ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో అన్నాను.. ఇప్పుడు ఏమి చెప్పలేను…#VijaySaiReddy pic.twitter.com/BSmgeIZpzY
— greatandhra (@greatandhranews) January 25, 2025