కిడ్నీ రాకెట్ కేసులో బిగ్ అప్డేట్.. 10 మందికి రిమాండ్

-

హైదరాబాద్ లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. అలకనంద ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ కేసు వెలుగుచూడగా..ముందుగా ఆస్పత్రి నిర్వాహ‌కుడితో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కిడ్నీ మార్పిడి దందా ఎలా సాగిందనే తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.

తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వ్యక్తులకు కిడ్నీ రాకెట్ కేసుతో సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. నిరుపేదల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని,వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారని విచారణలో తేలింది.దీంతో అలకనంద హాస్పిటల్‌ను సీజ్‌ చేసి, ఆస్పత్రి ఓనర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంత్రికి వివరించారు.

ముందుగా అలకనంద ఆస్పత్రి ఓనర్ సుమంత్‌, రిసెప్షనిస్ట్‌ గోపీలను సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జడ్జీ ముందు ప్రవేశపెట్టగా చర్లపల్లి జైలుకు రిమాండ్ చేశారు.అంతేకాకుండా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ కేసులో కర్ణాటకకు చెందిన బ్రోకర్లు, వైద్య సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news