హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. ప్రజాప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తానే చిక్కుల్లో పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి.
తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన సెటైరికల్ రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘పేదల కోసం మంత్రి పొంగులేటి హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాడు. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (IRIS) ద్వారా హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాడు. ఇలాంటివి మా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా కట్టాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విడుదల వీడియో సందేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పేదల కోసం మంత్రి పొంగులేటి హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాడు
ఇండ్లు లేని నిరుపేదలు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (IRIS) ద్వారా హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాడు
ఇలాంటివి మా… pic.twitter.com/QLOWWYaN1a
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025