ఎస్ఎస్ రాజమౌళిపై మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

-

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లో చేసిన ట్వీట్ అందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో తెలుగువారు అధికంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే పద్మ అవార్డులకు ఎంపికైన వారిని అభినందిస్తూ రాజమౌళి ఓ ట్వీట్ పెట్టారు. ‘ఈసారి ఏడుగురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. దానిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. అందరూ భారతీయులేనని, తెలుగు, ఇండియన్స్ ఎందుకు మాట్లాడటం. ప్రాంతీయ భేదాలు ఎందుకు? అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news