ఢిల్లీ బురారీలో భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని బురారీలోని కౌశిక్ ఎన్‌క్లేవ్ లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఇటీవల నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దింతో రెస్క్యూ ఆపరేషన్.. కొనసాగుతోంది. దింతో పోలీసులు, అగ్నిమాపక, డీడీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్.. ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఇప్పటి వరకు 10 మందిని రక్షించినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయపడిన కార్మికులలో ఒకరి బంధువు ఉన్నారు. ఆరుగురు కార్మికులను ఇక్కడికి (బురారీలోని ఆసుపత్రిలో) తీసుకువచ్చారు. కుప్పకూలిన భవనంలో దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకన్నారని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలోని బురారీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
ఘటన సమయంలో భవనంలో దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అంచనా
ఇప్పటివరకు 10 మందిని రక్షించినట్లు సమాచారం
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/GShVbsRck7
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025