ప్రేమోన్మాది ఉన్మాద చర్య.. మాట్లాడాదామని పిలిచి కర్రతో దాడి

-

ఏపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావు పేటలోని ఏఎం రెడ్డి కాలేజీలో గ్రీష్మ అనే యువతి బీ ఫార్మసీ చదువుతోంది.ఈ క్రమంలోనే గ్రీష్మకు మల్లికార్జున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కానీ, ఇటీవల కాలంలో గ్రీష్మ మరో యువకుడితో మాట్లాడుతోందని మల్లికార్జున్ అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైన గ్రీష్మను అంతమొదించాలని నిర్ణయించుకున్నాడు.

నీతో మాట్లాడాలనిఉందని చెప్పి గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి రమ్మని ఫోన్ చేశాడు. అది నమ్మిన గ్రీష్మ అక్కడికి వెళ్లగా మల్లికార్జున్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాట పెరిగి విచక్షణ కోల్పొయిన మల్లిఖార్జున్ కర్రతో తన ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గ్రీష్మకు తీవ్ర గాయాలయ్యాయి.ఆమె కేకలు విని స్థానికులు ప్రియుడు మల్లికార్జున్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని చికిత్స కోసం నరసరావు పేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news