మాటలకే పరిమితమైన సీఎం రేవంత్ పాలన : మాజీ మంత్రి హరీశ్ రావు

-

సీఎం రేవంత్ పాలన కేవలం మాటలకే పరిమితం అయ్యిందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.అయితే, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలనపై సెటైర్లు వేశారు.‘పోలీసు పహారా మధ్య గ్రామసభలు..కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాపాలన అంటివి..సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ అంటివి, ప్రతిరోజూ ప్రజలను కలుస్తా అంటివి.. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి’ అని దుయ్యబట్టారు.

సీఎం,మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా..దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు అని విమర్శించారు. తెలంగాణ సీఎం అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్నావు.. మంత్రులు, అధికారులను ప్యాలెస్‌కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నావు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news