వేములవాడలో ఓ యువకుడిపై విషప్రయోగం?

-

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్ కల్లు కాంపౌండ్‌లో ఓ యువకుడు(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, టౌన్ సీఐ వీర ప్రసాద్‌లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

డాగ్ స్క్వాడ్ బృందాలతో క్లూస్ కోసం చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించారు.మృతుడు పొడవాటి జుట్టు, గడ్డంతో తెల్లరంగు పూల చొక్కా,లేత సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతని కుడి చేయి మీద ప్రభ అనే పేరుతో పచ్చబొట్టు రాసి ఉంది. మృతుడి గురించి వివరాలు తెలిస్తే వేములవాడ పట్టణ పీఎస్‌లో రిపోర్టు చేయాలని పట్టణ సీఐ వీర ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కల్లుకంపౌండ్‌లో యువకుడిపై ఏమైనా విషప్రయోగం జరిగిందా? లేదా కల్తీ కల్లు తాగి మృతి చెందాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news